ఆర్ఆర్ఆర్ : ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఏడిపించేస్తాయట…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజ్ అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జైలులో ఎన్టీఆర్, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేస్తాయట. ఈ సన్నివేశం నేపథ్యంలో కాల భైరవ పాడిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ప్రేక్షకులను ఏడిపించేస్తుందట. ఇక ఇప్పటికే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ రంగంలోకి దిగారు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన పనితనంతో అందరినీ మెస్మరైజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా… చరణ్ కు జోడిగా అలియా ‘సీత’ పాత్రలో నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, శ్రియ శరన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13 న ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read
- Tags
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!