DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించిన ‘డీసీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్లో చేరి సంచలన విజయాన్ని నమోదు చేసింది. రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర నిర్మాత కళానిధి మారన్.. చిత్ర దర్శకుడు అరుణ్ మథేశ్వరన్, అలాగే ఈ సినిమా ద్వారా నటుడిగా మారిన దర్శకుడు లోకేష్ కనగరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లకు అత్యంత ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కార్లను బహుమతిగా అందించారు.
అందుకు సంబంధించిన వీడియోలను సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. గతంలో ‘జైలర్’ సినిమా భారీ హిట్ సాధించిన సమయంలో కూడా నిర్మాత కళానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లకు లగ్జరీ కార్లను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ‘డీసీ’ యూనిట్‌కు కూడా సర్ ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వామికా గబ్బీ పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్‌లో ఎంతో కీలక పాత్ర పోషించిన వామికా గబ్బీకి ఎలాంటి బహుమతి లేదా అంటూ నెటిజన్లు మేకర్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. “హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌కే కార్లు ఇచ్చారు.. సినిమా విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హీరోయిన్‌కు కనీసం ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వాల్సింది కదా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. లేడీ యాక్టర్లను ఇలా పక్కన పెట్టడం పట్ల సన్ పిక్చర్స్ తీరుపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..