NTV Telugu Site icon

Darshi : ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ టీజర్ డేట్ ఇదే..

Pridarshi

Pridarshi

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయనున్నారు. నవంబర్ 21, ఉదయం 11:12 కి టీజర్ విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు.

Also Read : AlluArjun : పుష్ప -2 ట్రైలర్ ఏ ఏ భాషల్లో ఎక్కడెక్కడ రిలీజ్ కానుందో తెలుసా..?

శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ  ”ఈ నెల 21వ తేదీన ఉదయం 11:12 గంటలకు మా ‘సారంగపాణి జాతకం’ టీజర్ విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులకు మా సారంగపాణి ప్రపంచం ఎలా ఉంటుందో ఆ రోజున పరిచయం చేస్తాం. సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేశాం. డబ్బింగ్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదా చేసే చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే ఓ పరిపూర్ణ హాస్యరస సినిమా ఇది. ఇంటిల్లిపాది చూసి నవ్వుకునే వినోదాత్మక సినిమా. మోహనకృష్ణ ఇంద్రగంటి చాలా అద్భుతంగా తీశారు. ఈ ఏడాది ఆఖరులో డిసెంబరు లో అందరినీ నవ్విస్తుందీ సినిమా” అని అన్నారు. ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ వంటి ఎందరో నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.

Show comments