గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో మార్చి 27 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది పెద్ది.
Also Read : Star Hero : హిట్ కోసం ఆపసోపాలు పడుతున్న స్టార్ హీరో.. రంగంలోకి సీనియర్ దర్శకులు
మరోవైపు ఈ సినిమా షూటింగ్ ను చక చక చేసేస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో భారీ యాక్షన్ సీన్స్ ఫినిష్ చేసుకుని వచ్చాడు బుచ్చిబాబు. కాగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకు కోసం డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ నెల 6వ తేదిన అనగా గురువారం పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే సాంగ్ ను రెడీ చేసి హీరోకు వినిపించి అనుమతి తీసుకోవడం కూడా జరిగింది. వాస్తవానికి దసరా కానుకగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా వేశారు. ఇప్పుడు సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ హైదరాబాద్ లో కన్సర్ట్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లో పెద్ది ఫస్ట్ సింగిల్ ను లైవ్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు.
