Site icon NTV Telugu

Allu Aravind: సాయి పల్లవిని తీసుకోవడానికి కారణం ఇదే..

February 7 (36)

February 7 (36)

ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన లభించగా.. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మారుమోగుతున్నాయి. అలాగే యూట్యూబ్‌లో ఈ సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ విషయంలో కూడా మూవీ టీం చాలా కష్టపడుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ సాయి పల్లవి గురించి  ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

Also Read:Prithviraj Sukumaran: మేము విజయం సాధించాం అనడానికి ఇదే నిదర్శనం : పుధ్వీరాజ్ సుకుమారన్‌

అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘ ‘తండేల్’ మూవీ లో సాయి పల్లవి ఎంపిక చేసింది నేనే. ఈ పాత్ర ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నది. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇలాంటి గొప్ప పాత్రను నిజాయతీగా చేయాలి.సాయిపల్లవి అయితే వంద శాతం న్యాయం చేయగలదని నాకు అనిపించింది. ఆమె అసాధారణమైన నటి. అందుకే ఆమెను ఎంపిక చేశాం. మేము అనుకున్నట్లుగానే సాయిపల్లవి వంద శాతం న్యాయం చేసింది’ అని తెలిపాడు అల్లు అరవింద్.ఇప్పటి వరకు జరిగిన ‘తండేల్’ ప్రతి ఒక ప్రమోషన్‌లో సాయి పల్లవి గురించి ప్రతి ఒక్కరు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. దీని బట్టి తన పని పట్ల తాను ఎంత నిజాయితీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమె లెడి పవర్ స్టార్ అయింది.

Exit mobile version