Site icon NTV Telugu

అందుకే ఇలియానాకు సౌత్ లో నో ఆఫర్స్… నిర్మాత షాకింగ్ కామెంట్స్

This Is The Reason Heroine Ileana Not Getting Chances in South Films

గోవా అందం ఇలియానాకు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇటు సౌత్ లోనూ, అటు నార్త్ లోనూ ఆమెకు అవకాశాలు లేవు. సౌత్ లో ఇల్లీ బేబీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ఉత్తరాదిన అడుగు పెట్టింది ఈ భామ. ఆ తరువాత సౌత్ వైపు చూడడమే మానేసింది. అందుకే ఇలియానాకు దక్షిణాదిగా అవకాశాలు తగ్గిపోయాయని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుక అసలు కారణం వేరే ఉందట. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “దేవుడు చేసిన మనుషులు” సినిమా చేస్తున్నప్పుడు ఇలియానాకు నటరాజు అనే తమిళ నిర్మాతకు మధ్య వివాదం నెలకొందట. విక్రమ్ హీరోగా ‘నందం’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్న ఇలియానా ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ముందుగా అడ్వాన్స్ గా తీసుకున్న 40 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని నిర్మాత ఇలియానా ను కోరారట. అయితే అందుకు ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన తమిళ నిర్మాతల మండలి సంప్రదించారు. ఈ విషయం అక్కడ కూడా పరిష్కారం కాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్దకు ఈ వ్యవహారం వెళ్ళింది. అయితే ఆమె మీద అధికారికంగా బ్యాన్ విధించకుండానే అనధికారికంగా ఎవరు ఆమెను సౌత్ సినిమాలలోకి తీసుకోకూడదని నిర్ణయించామని కాట్రగడ్డ ప్రసాద్ వెల్లడించారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version