Site icon NTV Telugu

HHVM : హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్ లిస్ట్ ఇదే

Hhvm

Hhvm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Also Read : Tollywood : ‘కూలీ’ పవర్ ముందు ‘వార్ 2’ నిలబడాలంటే ఇది సరిపోదు

విడుదల నేపధ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది యూనిట్. అందులో భాగంగానే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు రెడీ అయింది. అందుకోసం ఈ నెల 21న ముహూర్తం ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లో శిల్ప కళావేదికలో జరగబోతున్న ఈ వేడుకకు ముఖ్యఅతిథిలు ఎవరు అనే దానిపై యూనిట్ గట్టిగానే ఫోకస్ చేసింది యూనిట్. ఇప్పవరకు అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుకానున్నారు. అలాగే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరియు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విచ్చేయనున్నారు. వీరితో పాటు కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ కూడా హాజరుకానున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన పలువురు దర్శకులు, రాయకీయ నాయకులు, జనసేన పార్టీకి  చెందిన ఎమ్యెల్యేలు కూడా ఈ వేడుకకు అతిథిలుగా వస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఈవెంట్ కు టాలీవుడ్ దిగ్గజ దర్శకులు SS రాజమౌళి వస్తారని వార్తలు వినిపించాయి కానీ ఆయన రాకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. నేడు లేదా రేపటిలోగా క్లారిటి వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version