Site icon NTV Telugu

“డి44″లో ముగ్గురు భామలతో ధనుష్ రొమాన్స్

Jagame THandhiram to release on June 18

బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ తదుపరి చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ వర్షం కురుస్తోంది. ధనుష్ 44వ చిత్రానికి సంబంధించిన వరుస అప్డేట్స్ తో ఆయన అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “డి44″గా పిలుస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ చిత్రానికి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహిస్తుండగా, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు ధనుష్ స్వయంగా రాశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Read Also : ఒలంపిక్స్ లో మాధురీ దీక్షిత్ పాట… వీడియో వైరల్

దర్శకుడు, నటుడు భారతీరాజా, నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపిస్తారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇద్దరు ప్రముఖ నటీమణులు నిత్యా మీనన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించబోతున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇసినిమాలో మూడవ హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉందని, ఆ పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ చిత్రబృందం నుంచి మరో ప్రకటన ప్రకటన వచ్చింది. మేకర్స్ ఈ చిత్రంలో మూడవ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ నటించబోతున్నట్లు తెలియజేస్తూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.

Exit mobile version