Thiragabadara Saami to Release on August 2 Amid Back to Back Cases: ఒక పక్క రాజ్ తరుణ్ నన్ను మోసం చేసి మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో అఫైర్ పెట్టుకున్నాడని రాజ్ తరుణ్ లవర్ గా చెప్పుకుంటున్న లావణ్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోపక్క లావణ్య కావాలనే తనను బ్రష్టు పట్టిస్తోంది అంటూ రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మాల్వీ మల్హోత్రా కూడా రాజ్ తరుణ్- లావణ్య మధ్య ఏమి జరిగిందో నాకు అనవసరం నా పేరు బద్నాం చేస్తోంది అంటూ లావణ్య మీద ఫిర్యాదు చేసింది. ఇంతలా రచ్చ జరుగుతుంటే రాజ్ తరుణ్ హీరోగా మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా నటించిన తిరగబడరా సామి అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాను సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు.
Ram Charan: కొత్త కారు కొన్న చరణ్.. ఇండియాలోనే రెండోది.. ఆ ధరతో ఎన్ని ఫ్లాట్లు కొనచ్చో తెలుసా?
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉన్న సినిమాను తొలుత ఫిబ్రవరి 23న విడుదల చేయాలని భావించగా కుదరలేదు జులై 19న విడుదల ప్లాన్ చేయగా ఈ కేసుల వలన రాజ్ తరుణ్ ప్రచార కార్యక్రమాలాకు హాజరు కావడం కుదరదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించి ఆగస్టు -2న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రాజ్ తరుణ్ తిరగబడరా సామీ ప్రమోషన్స్ లో పాల్గొంటాడని నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ పాల్గొనకపోయినా వివాదంలో ఉండడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నారు. నిజానికి రక్షిత్ అట్లూరి ఆపరేషన్ రావణ్, విజయ్ ఆంటోనీ తుఫాన్, వరుణ్ సందేశ్ విరాజి, శ్రీ కమల్ ఉషా పరిణయం సినిమాలు అదే రోజు రిలీజ్ అవుతుండగా ఈ లిస్టులో రాజ్ తరుణ్ సినిమా కూడా చేసింది.