NTV Telugu Site icon

Pushpa -2 : ‘బేబీ జాన్’ సినిమా వేశారని తిరగబడిన పుష్ప-2 ఫ్యాన్స్

Pushpa2

Pushpa2

బాహుబలి తర్వాత మళ్లీ ఓ తెలుగు సినిమా బాలీవుడ్‌ని ఈ రేంజ్‌లో షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు సైత్ ఊహించలేదు. ప్రస్తుతం నార్త్‌లో పుష్పగాడి రూలింగ్‌కు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. థర్డ్ వీక్‌లో కూడా హిందీలో వంద కోట్లు రాబట్టిన సినిమాగా పుష్ప- 2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్‌లో రూ. 433 కోట్లు, సెకండ్ వీక్‌లో రూ. 199 కోట్లు, థర్డ్ వీక్‌లో రూ. 107 కోట్లకు పైగా రాబట్టి ఇప్పటి వరకు మొత్తంగా మూడు వారాల్లో రూ. 740 కోట్లకు పైగా నెట్ వసూలు చేసిందంటే. హిందీలో పుష్పగాడి బ్రాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  పుష్ప- 2 తర్వాత మూడు వారాలకు రిలీజ్ అయిన ‘బేబీ జాన్’ సినిమాను సైతం అక్కడివాళ్లు పక్కకు పెట్టేశారు.

Also Read : Varun Dhawan : బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా ‘బేబీ జాన్’

వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘బేబీ జాన్’ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ కాగా  పుష్పగాడి దెబ్బకు మొదటి రోజు రూ. 12 కోట్లు, రెండో రోజు రూ. 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.  అంతేకాదు నార్త్ లో ఓ థియేటర్ లో ‘పుష్ప 2’  చూసేందుకు ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్ చేసుకుని షో టైమ్‌కి థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు సదరు థియేటర్‌ యాజమాన్యం ‘పుష్ప 2’కు బదులుగా ‘బేబీ జాన్’ సినిమా ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. దీంతో పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు మండిపోయింది. ఎలాంటి సమాచారం లేకుండా షో ఎందుకు క్యాన్సిల్ చేశారంటూ ఫైర్ అయ్యారు.  తాము చూస్తే పుష్ప – 2నే చూడాలి అన్నట్టుగా బాలీవుడ్ ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. కాదంట తిరగబడి కొట్టేలా ఉన్నారని, బేబీ జాన్ సినిమాను ఈ సమయంలో అనవసరంగా రిలీజ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show comments