Site icon NTV Telugu

OG : అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు!

Og

Og

They Call Him OG shoot has Resumed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఓజి. ముంబై బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఒక డై హార్డ్ ఫ్యాన్‌ పవన్‌ను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఓజితో చూపించబోతున్నాడు సుజీత్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పవన్ ఒక్కసారి డేట్స్ ఇస్తే చాలు.. షూటింగ్ మొత్తం పూర్తవుతుంది అని మేకర్స్ చెబుతున్నారు.

Bigg Boss: ఛానల్ తో విభేదాలు.. ఇదే నాకు చివరి బిగ్ బాస్ సీజన్.. స్టార్ హీరో కీలక ప్రకటన?

పవన్ కూడా ముందుగా ఓజి సినిమాను కంప్లీట్ చేయడానికి రెడీగానే ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ముందుగా ఆయన హరిహర వీరమల్లు సినిమా కోసం కొన్ని డేట్లు కేటాయించారు. ఇదిలా ఉండగా పవన్ ఇప్పుడు ఓజీ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటిచింది. షూట్ మొదలైందని త్వరలో పవన్ కూడా జాయిన్ అవుతారని ప్రకటించింది. ఈ సెప్టెంబర్ 27న ఓజి థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ పవన్ రాజకీయంగా బిజీ అవ్వడంతో.. ఓజిని వాయిదా వేశారు. 2025 సమ్మర్ కానుకగా మార్చ్ 27న ఓజి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. లాంగ్ వీకెండ్ కలిసొచ్చేలా దాదాపుగా ఇదే డేట్‌ను మేకర్స్ లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.

Exit mobile version