NTV Telugu Site icon

They Call Him OG: అలాంటోడు వచ్చి అలా నిలబడ్డాడు అంతే సార్!!

Og Pawan

Og Pawan

They Call Him OG New Poster Released: ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరొక సినిమాలు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అవ్వకముందే పలు సినిమాలను లైన్లో పెట్టారు. ఆ సినిమాలలో ఓజీ కూడా ఒకటి. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమాని సుజిత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. థె కాల్ హిం ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలుపెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడంతో ఈ సినిమా మాత్రమే కాదు ఏ సినిమా షూటింగ్స్ లోనూ పాల్గొనలేదు.

Love Reddy Failure meet: టాలీవుడ్ హిస్టరీలోనే మొట్టమొదటి ఫెయిల్యూర్ మీట్

ఈ మధ్యనే ఆయనకి కాస్త గ్యాప్ దొరకడంతో సినిమా షూటింగ్స్ మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ అకౌంట్ కి సంబంధించిన హెడర్ మార్చేందుకు గాను ఈ పోస్టర్ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ జస్ట్ అలా నిలబడి కారు మీద కత్తితో పొడుస్తూ ఉన్న ఫోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకపక్క బాంబు పేలుళ్లు మరోపక్క ఒక ప్రదేశానికి చెందిన మ్యాప్ ని చూపిస్తూ వెనుక ఇండియా గేట్ బ్యాక్ గ్రౌండ్లో పవన్ ను సైలెంట్ కిల్లర్లో చూపిస్తున్నారు. మొత్తం మీద సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతుందని ఇప్పటినుంచే హింట్స్ ఇస్తోంది సినిమా యూనిట్.

Show comments