కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకేక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఎల్2 ఎంపురాన్’ గ్లిమ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
Also Read : NANI : ప్రీమియర్స్ తోనే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న చిన్న సినిమా
మార్చి 27న “ఎల్ -2 ఎంపురాన్” ను పాన్ ఇండియా బాషలలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాపై సోషల్ మీడియాతో పాటు మాలీవుడ్ సర్కిల్స్ లోను ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఎంపురాన్ సినిమాను నిర్మించింది. ఆ సంస్థ నిర్మించిన గత సినిమాలు ఇండియన్ 2 భారీ డిజాస్టర్ కాగా విదాముయార్చి యావరేజ్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల బయ్యర్స్ భారీ నష్టాలు రావడంతో ఇప్పుడు రాబోతున్న ఎంపురాన్ లో ఆ నష్టాలు భర్తీ చేయాలని లేదంటే ఎంపురాన్ రిలీజ్ కనివ్వమని బయ్యర్స్ చెప్పినట్టు టాక్ నడుస్తోంది. అయితే సదరు నిర్మాణసంస్త మాత్రం ఎంపురాన్ రిలీజ్ విషయంలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు, చెప్పిన డేట్ మార్చి 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని తెలిపింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఎంపురాన్ మాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.