RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది

Tollywood (2)

Tollywood (2)

మాస్ మహారాజ రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు భక్తిభావంతో కూడిన ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్.. అయ్యప్ప స్వామి నేపథ్యంలో సాగే రెండు భక్తి పాటలను కంపోజ్ చేశారట. ఈ రెండు పాటలు సినిమాలో కథను మలుపు తిప్పే సందర్భంలో ఎంతో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఒకటి ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే అయ్యప్ప స్వామి సాంగ్ ‘బంగారు పల్లకి’ కాగా.. మరో కొత్త ట్యూన్ మామూలుగా ఉండదని టాక్. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, ఒక కూతురి కోసం వ్యసనాలను వదిలి అయ్యప్ప మాల ధరించే ఎమోషనల్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దర్శకుడు శివ నిర్వాణ ఎంతో హార్ట్ టచింగ్‌గా విజువలైజ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఇరుముడిని థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

×
×
Ad