RaviTeja : ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో పాటు భక్తిభావంతో కూడిన ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్.. అయ్యప్ప స్వామి నేపథ్యంలో సాగే రెండు భక్తి పాటలను కంపోజ్ చేశారట. ఈ రెండు పాటలు సినిమాలో కథను మలుపు తిప్పే సందర్భంలో ఎంతో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఒకటి ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే అయ్యప్ప స్వామి సాంగ్ ‘బంగారు పల్లకి’ కాగా.. మరో కొత్త ట్యూన్ మామూలుగా ఉండదని టాక్. ఈ సినిమాలో రవితేజ తన రెగ్యులర్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, ఒక కూతురి కోసం వ్యసనాలను వదిలి అయ్యప్ప మాల ధరించే ఎమోషనల్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. దర్శకుడు శివ నిర్వాణ ఎంతో హార్ట్ టచింగ్‌గా విజువలైజ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఇరుముడిని థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
తాజావార్తలు
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!