NTV Telugu Site icon

NANI : నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ గ్లిమ్స్.. నెవర్ బిఫోర్..

Nani

Nani

నేచురల్ స్టార్ నాని బ్యాక్ టై బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సీక్వెల్ లో నటిస్తున్న నాని, మరోవైపు తనకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించిన ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

ముందు నుండి ది ప్యారడైజ్ వేరే లెవల్ అని చెప్తూ వస్తున్నాడు. అందుకు తగ్గట్టే ది ప్యారడైజ్ గ్లిమ్స్ ఉందని చెప్పాలి. ఇక గ్లిమ్స్ స్టార్టింగ్ లో రా ట్రూత్, రా లాంగ్వేజ్ అని డిస్క్లైమర్ తోనే ఈ అర్ధం అవుతుంది ఎలా ఉండబోతుంది అనేది. అందుకు తగ్గట్టే బ్యాగ్రౌండ్ లో వాయిస్ ఓవర్ వస్తూ ఇది ఓ కాకుల కథ, జమానా జమానాలో నడిచిన శవాల కథ, రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ, తల్వర్ పట్టుకున్న కాకుకులను ఒక్కటి చేసిన ఓ లం.. కథ, నాయకుడైన నా కొడుకు కథ అని చెప్తూ సినిమా ప్లాట్ ఏంటో చెప్పకనే చెప్పేసారు. ఇక నాని లుక్ అయితే వేరే లెవల్ అని చెప్పాలి. సిక్స్ ప్యాక్ లుక్ లో ఆడవారి మాదిరి రెండు జెడలు వేసుకున్న నాని మునుపెన్నడూ చూడని విధంగా ఓ యానిమల్, ఓ పుష్ప రేంజ్ లో ఉందని చెప్పాలి. ఇక అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా 26 మార్చి 2026న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.