పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ “వకీల్ సాబ్”. హిందీ బ్లాక్ బస్టర్ “పింక్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన “వకీల్ సాబ్”కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత పవన్ ను మళ్ళీ వెండితెరపై చూడడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫలితంగా కరోనా ఉన్నప్పటికీ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఈ కోర్ట్ డ్రామా ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
Read Also : అందరివాడు అండా రామారావు కన్నుమూత!
“వకీల్ సాబ్” జూలై 18న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య నాగల్ల, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. తమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేశాడు. మరి ఈ చిత్రం ఎలాంటి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
