NTV Telugu Site icon

The Survivor : ది సర్వైవర్ సినిమాతో ఎన్నో అవార్డులు గెలుచుకున్న రజత్ రజనీకాంత్

Untitled Design (12)

Untitled Design (12)

రజత్ రజనీకాంత్ లీడ్ యాక్టర్, రైటర్, డైరెక్టర్, మరియు ఎడిటర్ గా చేస్తూ ఎన్నో ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులు అందుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందులో తనకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా సర్వైవర్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు జియో సినిమాలో అందుబాటులో ఉన్న ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. కేన్స్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ ట్రైలర్ మరియు బెస్ట్ యాక్షన్ ఫిలిం కి అవార్డు అందుకున్న సినిమా సర్వైవర్. రజత్ రజనీకాంత్ ఎంచుకున్న కథ, యాక్షన్ ఎపిసోడ్స్, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి. అదేవిధంగా రజత్ పర్ఫామెన్స్ కి మూడు ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ అందుకున్నారు. సినిమా మీద పాషన్ తో 2018 నుంచి మూడు సినిమాలు చేశారు. చేసిన ప్రతి సినిమాకి అవార్డు అందుకుంటున్నారు. కానీ ది సర్వైవర్ సినిమా ద్వారా ఎక్కువ గుర్తింపు పొందారు. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు రజత్ పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కచ్చితంగా ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేస్తారని ఆశిస్తున్నారు.

Also Read : Prabhas : రెబల్ స్టార్ రెండు సినిమాలకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ఇవే..

Show comments