బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’. అశ్విన్ విరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ పాట విడుదలైంది. ‘ది సోల్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్’ పేరుతో ఈ పాటను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంది. గుణ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి సంగీతం అందించారు. అనసూయ ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 7న ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారం కానుంది.
ఆకట్టుకున్న ‘ది సోల్ ఆఫ్ థ్యాంక్ యూ బ్రదర్’
