సమంత లాంగ్ గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమా చేసేందుకు రెడీ అయింది. గత కొంత కాలంగా బాలీవుడ్ మోజులో టాలీవుడ్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇటీవల నిర్మాతగా మరో అవతారం ఎత్తి తొలి ప్రయత్నంగా అందరు కొత్త నటీనటులతో ‘ శుభం’ అనే చిన్న సినిమాను నిర్మించింది. థియేటర్స్ లో అంతగా మెప్పించని ఈ సినిమా ఓటీటీలో కాస్త సందడి చేసింది. సినిమా నిర్మాణంలో తొలి పెట్టుబడి పెట్టిన సమంతకు ఓటీటీ రూపంలో బాగానే గిట్టుబాటు అయింది. మంచి లాభాలు చూసింది. కానీ శుభం కు ముందు సమంత నిర్మాణంలో ఓ సినిమా స్టార్ట్ చేసింది.
Also Read : Tollywood : ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలం..షూటింగ్స్ బంద్?
ఆ సినిమాలో తానె స్వయంగా నటిస్తూ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి బేబీ, అలా మొదలైంది చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించనుంది. గతంలో వీరిద్దరి కాంబోలో 2019లో వచ్చిన ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది సమంత బర్త్ డే సందర్భంగా ‘ మా ఇంటి బంగారం’ అనే సినిమా అనౌన్స్ చేసారు. కానీ వివిధ కారణాల వలన ఈ సినిమాను చాలా కాలంగా పక్కన పెట్టేసింది సమంత. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో నందిని రెడ్డి – సమంత ఈ సారి వైలెంట్ జానర్ లో వస్తున్నారు అని హింట్ కూడా ఇచ్చారు. అయితే చాలా కాలంగా ఆగిన ఈ సినిమా తిరిగి షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది. ఈ ఏడాది సెప్టెంబరు లో షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
