మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ కథానాయికగా ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘ఇరుముడి‘. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న రవితేజకు ఇరుముడి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అయ్యప్ప స్వామి భక్తుడిగా రవితేజ విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో తన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. రవితేజ కెరీర్‌లోనే కాకుండా టోటల్ టాలీవుడ్‌లోనే ఒక రికార్డ్ బ్రేకింగ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా థియేటర్లలో ఇంకా మంచి రన్ కొనసాగిస్తున్నప్పటికీ ఫైనల్‌గా డిజిటల్ ప్రియుల ముందుకు వచ్చేసింది.
ఈ సంచలన చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాను నేటి నుంచి ఈ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్. ఆగస్టు 21న రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు వారాల తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రాంగ్ ఎమోషన్స్, రేసీ స్క్రీన్‌ప్లేతో బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయినవారు మరియు మళ్లీ చూడాలనుకునేవారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మీ ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.

