Site icon NTV Telugu

Game Changer : మరింత ఆలస్యం కానున్న ‘గేమ్ చేంజర్’ రిలీజ్..?

Whatsapp Image 2024 05 09 At 7.22.28 Am

Whatsapp Image 2024 05 09 At 7.22.28 Am

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.పొలిటికల్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది .ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.

దర్శకుడు శంకర్‌ ‘గేమ్‌ఛేంజర్‌’సినిమా తో పాటు విశ్వనటుడు కమల్‌హాసన్‌ తో ‘ఇండియన్‌-2’ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. దీంతో ఆయన ‘గేమ్‌ఛేంజర్‌’ చిత్రం కోసం శంకర్ తన పూర్తి సమయాన్ని కేటాయించలేదు. ఈ కారణంగా “గేమ్ ఛేంజర్” షూటింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే రాంచరణ్ నటించిన ‘గేమ్‌ఛేంజర్‌’ రిలీజ్‌ ఎప్పుడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాలి.. ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ మరియు నవీన్‌చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు .

Exit mobile version