Game Changer : మరింత ఆలస్యం కానున్న ‘గేమ్ చేంజర్’ రిలీజ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది .ఈ సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది.
దర్శకుడు శంకర్ ‘గేమ్‌ఛేంజర్’సినిమా తో పాటు విశ్వనటుడు కమల్‌హాసన్ తో ‘ఇండియన్-2’ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. దీంతో ఆయన ‘గేమ్‌ఛేంజర్’ చిత్రం కోసం శంకర్ తన పూర్తి సమయాన్ని కేటాయించలేదు. ఈ కారణంగా “గేమ్ ఛేంజర్” షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే రాంచరణ్ నటించిన ‘గేమ్‌ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాలి.. ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్ మరియు నవీన్‌చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు .
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Tags
- Game Changer
- ramcharan
- Shankar
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!