NTV Telugu Site icon

రియల్ కోవిడ్ హీరోస్ నర్సులు : చిరంజీవి

The Real Covid Heroes are Nurses Says Chiranjeevi

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా ద్వారా నర్సులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నర్సులకు ‘అంతర్జాతీయ నర్సుల దినోత్సవం’ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “దేశంలోని, ప్రపంచంలోని నర్సులు అందరికీ సెల్యూట్. రియల్ కోవిడ్ హీరోస్ నర్సులు. హెల్త్ కేర్ సిస్టం లో ముఖ్యమైన భాగం… మీరు ప్రపంచం ఆరోగ్యంగా ఉండడానికి అలసిపోకుండా సేవ చేస్తున్నారు. మీ అందరికీ మరింత శక్తి చేకూరాలి. మీ హీలింగ్ టచ్ కు కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం దేశం కరోనా మహమ్మారితో పోరాడుతోంది. ఈ సమయంలోనే వైద్యులు, నర్సులు, పోలీసులు తదితర ఫ్రంట్ లైన్ వారియర్స్ ఏమాత్రం రెస్ట్ లేకుండా ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో “హ్యాపీ నర్సెస్ డే’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.