NTV Telugu Site icon

The Raja Saab: అవేమీ నమ్మొద్దు.. రాజా సాబ్ టీం కీలక ప్రకటన

The Rajasaab

The Rajasaab

The Raja Saab Team alert on Fake Auditions: మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాజా సాబ్ అనే సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. సంక్రాంతి సమయంలో ప్రభాస్ కటౌట్ కూడా ఒకదాన్ని రిలీజ్ చేశారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా హైదరాబాదులో జరుగుతుంది. హీరోయిన్స్ మీద ఈ షూటింగ్ ప్లాన్ చేశారు. త్వరలో ప్రభాస్ కూడా ఈ సెట్లో ఎంటర్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద పూర్తిగా క్లారిటీ లేదు.

Aarambham: ‘ఆరంభం’ ఆరంభమైంది.. ఎక్కడ చూడాలంటే?

అయితే తాజాగా ఈ సినిమా యూనిట్ ఒక కీలకమైన ప్రకటన చేసింది. అదేంటంటే ఈ సినిమా ఆడిషన్ కి సంబంధించిన కొన్ని ఫేక్ న్యూస్ సర్కులేషన్ జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే అవన్నీ నిజం కాదని ఇలాంటి వాటిని ఎవరు ఎంకరేజ్ చేయొద్దని చెప్పుకొచ్చింది. సినిమాకి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తామే అధికారికంగా రిలీజ్ చేస్తామని అప్పటివరకు బయట నుంచి వచ్చిన వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా ఒక హారర్ కామెడీ అనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది అయితే అది ఎంతవరకు నిజమవుతుందనే విషయం సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం. ఏకంగా ఈ సినిమాలో ఐదు ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది కానీ అధికారిక ప్రకటన మాత్రం లేదు.

Show comments