కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్, సలార్ ఒక ఎత్తు అయితే కాంతార మరో ఎత్తు. ఎందుకంటే కేజీఎఫ్, సలార్లకు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. కానీ కాంతార జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే కాసుల సునామీ సృష్టించింది. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. ఊహించని ఈ హిట్టుతో హోంబలే కాంతార ప్రీక్వెల్ కాంతార చాప్టర్ వన్ పై భారీగా ఖర్చు పెడుతోంది.
Also Read :STR : డేరింగ్ డెసిషన్ తీసుకున్న తమిళ స్టార్ హీరో శింబు
కాంతార ప్రీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మధ్యలో కొంత వివాదంలో చిక్కుకున్నప్పటికీ ఇష్యూస్ సాల్వ్ కావడంతో మళ్లీ షూటింగ్ స్టార్టైంది. అయితే కాంతార చాప్టర్ 1 వేరే లెవల్ తీసుకెళ్లేందుకు హోంబలే చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఆడియన్స్‌కి ఎక్స్‌ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలను సిద్దం చేస్తుందట. ఇంతకు ముందు చూడని యుద్ధ సన్నివేశాలు చాప్టర్ వన్ లో ఉండబోతున్నాయట. అందుకోసం 500 మందికి పైగా వెల్ ట్రైన్డ్ ఫైటర్లను ప్రిపేర్ చేసింది. అంతేకాదు ఈ ఫైట్ కోసమే రిషబ్ శెట్టి కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్దం, పురాతన యుద్ద కళైన కలరియపట్టు వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడట. యాక్షన్ కొరియోగ్రాఫర్లతో షూటింగ్ చేయబోతున్నారని టాక్. ఖర్చుకు ఏమాత్రం వెనకబడటం లేదట హోంబలే ఫిల్మ్స్. అన్ని కంప్లీట్ అయితే ఈ ఏడాది అక్టోబర్ 2న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.