Site icon NTV Telugu

The Paradise : ది ప్యారడైజ్‌కి డబుల్ ట్రీట్..

The Paradise

The Paradise

‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు మరో మాస్ అండ్ ఇంటెన్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. అదే ‘ది ప్యారడైజ్’. ‘ద‌స‌రా’ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండ‌గా.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి అనౌన్స్‌మెంట్ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. మంచి స్పందన లభించగా.. ఇంత ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఇద్దరు లెజెండ్స్ యాక్టర్స్ జాయిన్ ఇవ్వబోతున్నట్లు సమాచారం..

Also Read : SANJAY DUTT : సౌత్ సినిమాలపై సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు..

మోహన్ బాబు ఈ చిత్రంలో ఒక కీలకమైన ప్రతికూల పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇది పూర్తి స్థాయిలో అధికారికంగా వెల్లడి కాకపోయినా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల మోహన్ బాబును కలిసి చర్చించినట్లు మంచు విష్ణు తెలియజేయడం విశేషం. అంతే కాదు తాజాగా నటనలో తిరిగి చురుకైన పాత్రలు స్వీకరిస్తున్న బాబు మోహన్ కూడా పాల్గొనబోతున్నట్లు స్వయంగా ధృవీకరించారు. ఇటీవల కీర్తి సురేష్ నటించిన ‘ఉప్పు కప్పురం’ చిత్రంలో భీమయ్య పాత్రతో కనిపించిన ఆయన, ఇప్పటికే రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా ఇంకొక ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు.

Exit mobile version