The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే

The Paradise

The Paradise

నాని కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వదంతులు, పోస్ట్‌పోన్ కానుందంటూ ప్రచారాలు షికారు చేశాయి.  అయితే ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ  సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుందని మరోసారి ప్రకటించారు. దాంతో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే, ఈ సినిమాకి సంబంధించి మరొక సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. చిత్రం థియేటర్లలోకి రావడానికి కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది కానీ నిర్మాణానంతర పనులు మరియు షూటింగ్ ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదనే ప్రచారం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో మ్యూజికల్ కన్సర్ట్ టూర్‌లో బిజీగా ఉన్నారు. దీనివల్ల ‘ది ప్యారడైజ్’ రీ-రికార్డింగ్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయనే టాక్ నడుస్తోంది. గ్రాండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అత్యంత కీలకం. మరోవైపు చిత్ర యూనిట్ ఇంకా ఒక పాట చిత్రీకరణతో పాటు కొన్ని ముఖ్యమైన ప్యాచ్‌వర్క్ సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉందట. షూట్ ఫినిష్ చేసి అనిరుధ్ కి కంటెంట్ ఇస్తే ఆర్ ఆర్ జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి ఇవ్వాలి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తక్కువ సమయంలో ఈ పనులన్నీ పూర్తి చేసి సినిమాను అనుకున్న సమయానికి సిద్ధం చేయడం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారేలా ఉంది.