The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వదంతులు, పోస్ట్‌పోన్ కానుందంటూ ప్రచారాలు షికారు చేశాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుందని మరోసారి ప్రకటించారు. దాంతో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది.
అయితే, ఈ సినిమాకి సంబంధించి మరొక సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. చిత్రం థియేటర్లలోకి రావడానికి కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది కానీ నిర్మాణానంతర పనులు మరియు షూటింగ్ ప్యాచ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదనే ప్రచారం ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో మ్యూజికల్ కన్సర్ట్ టూర్లో బిజీగా ఉన్నారు. దీనివల్ల ‘ది ప్యారడైజ్’ రీ-రికార్డింగ్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయనే టాక్ నడుస్తోంది. గ్రాండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అత్యంత కీలకం. మరోవైపు చిత్ర యూనిట్ ఇంకా ఒక పాట చిత్రీకరణతో పాటు కొన్ని ముఖ్యమైన ప్యాచ్‌వర్క్ సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉందట. షూట్ ఫినిష్ చేసి అనిరుధ్ కి కంటెంట్ ఇస్తే ఆర్ ఆర్ జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసి ఇవ్వాలి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తక్కువ సమయంలో ఈ పనులన్నీ పూర్తి చేసి సినిమాను అనుకున్న సమయానికి సిద్ధం చేయడం మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారేలా ఉంది.
Also Read
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
తాజావార్తలు
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!