Site icon NTV Telugu

Thaman : తలసేమియా బాధితులకు సహాయార్ధం ‘తమన్’ యుఫోరియా మ్యూజికల్ నైట్

Shreyas

Shreyas

తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ అద్ర్యంలో ‘యుఫోరియా’ పేరుతో తమన్ భారీ మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నాడు. ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం లో మ్యూజికల్ నైట్ జరగనుంది. ఇందుకు సంబందించిన బుక్ మై షో లో మ్యూజికల్ నైట్ టికెట్ లు అందుబాటులో ఉంచారు నిర్వాహకులు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ‘మంచి ఆలోచనతో మంచి విషయాలు మొదలౌతాయి. సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన చాలా గొప్పది. ఒక వైరస్ మనల్ని ఏ పని చేయనివ్వకుండా ఆపేసింది. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటుగా నారా భువనేశ్వరి కూడా సామాజిక స్పృహతో పని చేస్తున్నారు. ఈ విధమైన షో చేయడానికి అవకాశం రావడం నాకు చాలా అదృష్టం. ఇది నా ఫ్యామిలీ షో అని అంటాను’ అని అన్నారు. ‘

Also Read : Shekar Bhasa : బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పై నార్సింగి పీస్ లో మరో కేసు నమోదు

ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మాట్లాడుతూ ‘ సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అనే స్ఫూర్తితో ఈ ట్రస్టు స్ధాపించారు.  తలసీమియా జన్యు పరమైన రక్త హీనత. రక్తం తక్కువగా ఉన్న వ్యక్తులు ఎంతో బాధ పడుతుంటారు. ఊపిరి తీసుకోవడానికి కూడా తలసీమియా బాధితులు బాధపడుతుంటారు. అందరూ రక్తదానాన్ని ప్రోత్సహించాలి. రక్తదానం ఎందరో జీవితాలని నిలబెడుతుంది.తలసీమియా సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించాము. తలసీమియా సెంటర్లు ప్రారంభించడానికి అవసరమైన ఫండ్ రైజింగ్ కి ఈ షో ప్లాన్ చేసాం. మా ఆలోచనను ఒప్పుకుని డేట్స్ ఇస్తానని థమన్ ముందుకు వచ్చారు. ఈ షో కోసం తమన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఫ్రీగా షో చేయడానికి సిద్ధమయ్యారు. తమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని అన్నారు.

Exit mobile version