జూనియర్ ఎన్టీయార్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో కథలో ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆచి తూచి సినిమాలు సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. దింతో పాటుగా బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ 2 లోను నటిస్తున్నాడు.
Also Read : MrBachchan : మిస్టర్ బచ్చన్ కోసం ఆంధ్ర డిప్యూటీ సీఎం.. ఇక రచ్చ రచ్చే..
మరోవైపు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా రానున్నట్టు గతేడాది ప్రకటించారు. తారక్ తో సినిమాపై గతంలో ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ” 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఐడియా, అప్పట్లో బడ్జెట్, హీరో దొరకని కారణంగా పక్కన పెట్టాను.ఇన్నాళ్లకు నా కల నెరవేరబోతోంది. ఈ కథ నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇప్పడు నా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది” అని తెలిపాడు. కాగా నేడు ఈ సినిమా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి తారక్ భార్య, పిల్లలతో వచ్చాడు. ఎన్టీఆర్ భార్య ప్రణతి కెమేరా స్విచ్చాన్ చేసారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కుటుంబ సభ్యులు, కళ్యాణ్ రామ్, మైత్రీ నవీన్, రవి శంకర్, దిల్ రాజు, హర్షిత్, ఒకరిద్దరు నిర్మాతలు మినహా మరెవరూ సినిమాతో సంబంధం లేని వారు హాఙరు కాలేదు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మాస్ సినిమాలకు పెట్టింది పేరు జూనియర్ ఎన్టీఆర్. అటు వంటి హీరోతో అదే స్థాయిలో మాస్ టేకింగ్స్, ఎలివేషన్స్ తో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ పై విధ్వసంచేస్తుందనడంలో సందేహమే లేదు.