ఈ మద్య కాలంలో చోటా ప్యాకెట్ బాగా ధమాకా అనట్లు చిన్న సినిమాలు మంచి హిట్ అందుకుంటున్నాయి. కాన్‌సెప్ట్ ఏ మాత్రం బాగున్న ప్రేక్షలు బాగా ఆదరిస్తున్నారు. అలా వచ్చి హిట్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో చిత్రం వచ్చి చేరింది అదే ‘జిగేల్’. మల్లి యేలూరి దర్శకత్వంలో కామెడీ థ్రిల్లింగ్ కథతో ఆ కట్టుకోబోతున్న ఈ మూవీలో త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తుండగా, ఇటివలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా సాంగ్స్ కి కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి.
Also Read: Anshu Ambani: మన్మధుడు అన్షు భర్త, పిల్లలను చూశారా?
ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి వర్క్ చేయగా ,ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీ గా పని చేస్తున్నాడు. ఇక త్రిగుణ్ , మేఘా చౌదరి తో పాటుగా షియాజి షిండే, పోసాని కృష్ణమురళి, రఘు బాబు, పృథ్వీ రాజ్, మధు నందన్, ముక్కు అవినాష్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన, రమేష్ నీల్, అబ్బా టీవీ డా. హరిప్రసాద్ వంటి నటీనటులంతా ఈ మూవీలో భాగం అయ్యారు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ మార్చి 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది అని తెలిపారు.