NTV Telugu Site icon

సర్కారు వారి పాట : మహేష్ కు విలన్ గా తమిళ స్టార్ ?

The Kollywood star plays an antagonist in Sarkaru Vaari Paata

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఉగాది సందర్భంగా స్టార్ట్ అయ్యింది. రెండవ షెడ్యూల్ లో కరోనాకు సంబంధించిన అన్ని భద్రతా చర్యలను అనుసరిస్తూ షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఇప్పటివరకు పలువురు స్టార్స్ మహేష్ కు విలన్ గా నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ జాబితాలో తమిళ నటుడు అరవింద్ స్వామి, కన్నడ స్టార్ ఉపేంద్రల పేర్లు ఉన్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మరో తమిళ స్టార్ పేరు తెరపైకి వచ్చింది. తమిళ స్టార్ మాధవన్ ‘సర్కారు వారి పాట’లో మహేష్ కు విలన్ గా నటించబోతున్నారట. అయితే ఇందులో నిజం ఎంతో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేగానీ తెలీదు. మాధవన్ ఇప్పటికే తెలుగులో నాగచైతన్య ‘సవ్యసాచి’, అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రాల్లో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్‌లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.