సూపర్ హీరో స్టోరీలకు హాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనూ ఫుల్ క్రేజ్. ఈ తరహా కథలు గతంలో బీటౌన్‌లో అడపాదడపా చూశాం. మిస్టర్ ఇండియా నుండి క్రిష్, రా వన్ ఈ జోనర్ కిందకే వస్తాయి. ఇక సౌత్‌లో ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా అరుదు. తెలుగులో అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్‌గా అలరిస్తే.. రీసెంట్‌గా హనుమాన్‌లో తేజసజ్జా సూపర్ హీరోగా కనిపించాడు. ఈ సినిమా మంచి హిట్ సాదించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఫీమేల్ సూపర్ ఉమన్ మహాకాళిని ఎనౌన్స్ చేశాడు.
ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలకు రెడీ అవుతోంది మాలీవుడ్. ఇప్పటికే మిన్నల్ మురళి రూపంలో ఓ సూపర్ హీరో కథను మలయాళ ప్రేక్షకులకు చూపించింది. కానీ ఇది ఓటీటీకే పరిమితం కావడంతో థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయింది. అందుకే మరో ప్రయోగం చేస్తోంది. అయితే ఈ సారి మెన్ కాకుండా సూపర్ ఉమెన్ కథతో సినిమా నిర్మిస్తోంది. లోకా చాప్టర్ వన్ – చంద్ర అనే ఫీమేల్ సూపర్ హీరో స్టోరీతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను వే ఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు దుల్కర్ సల్మాన్. లోకా సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ ఉమెన్‌గా యాక్షన్ అదరగొట్టింది. దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా లోకా గ్లింప్స్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేమలుతో టాలీవుడ్‌కు చేరువైన నటుడు నస్లేన్ ఇందులో హీరోగా నటిస్తుండగా డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓనం పండుగను టార్గెట్ చేస్తూ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది లోకా.
Also Read : Betting App Case : ఈడి ఎదుట హాజరైన నటుడు ప్రకాష్ రాజ్.. అరెస్ట్ తప్పదా?
