Site icon NTV Telugu

The Kashmir Files: అమిత్ షా తో అనుపమ్ ఖేర్ టీమ్ భేటీ!

The Kashmir Files Movie Unit Meet Union Minister Amit Shah Today.

వివేక్ రంజన్ అగ్రిహోత్రి తెరకెక్కించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీకి సంబంధించిన చర్చే ఇవాళ సోషల్ మీడియాలో అత్యధికంగా జరుగుతోంది. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీని ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది. విశేషం ఏమంటే… 1990లో కశ్మీర్ లో జరిగిన దుర్ఘటనలపై విచారణ జరిపించాలని అప్పటి సీఎం ఫరూఖ్ అబ్దుల్లా సైతం డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అనుపమ్ ఖేర్, పల్లవిజోషి, ఆమె భర్త, చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షాను కలిశారు.

ఆయన మూవీ యూనిట్ తో పలు కీలక అంశాల గురించి చర్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అమిత్ షాను కలిసిన ఫోటోలను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కశ్మీరీ ప్రజలు, అక్కడి భద్రతా దళాల కోసం అమిత్ షా చేస్తున్న కృషి గొప్పదని వివేక్ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ మరింత బలోపేతం అవుతుందని, మానవత్వానికి, ఏకతకు కశ్మీర్ ఉదాహరణగా నిలిచేందుకు ఆ చర్యలు ఉపయోగపడతాయని వివేక్ అభిప్రాయ పడ్డారు.

Exit mobile version