Site icon NTV Telugu

Athadu4K : ‘అతడు’ మరోసారి వస్తున్నాడు..

Atadu

Atadu

సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ ప్ఫరామెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట రికార్డ్ నెలకొల్పింది.

Also Read : Tollywood : నిర్మాతగా మారిన మరొక స్టార్ హీరోయిన్.. కీయురి ప్రొడక్షన్స్ పేరిట బ్యానర్ స్టార్ట్

టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాల ట్రెండ్ లో భాగంగా అతడు ఈనెల 28న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. కాగా ఈ సినిమాను నైజాంలో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుండగా ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటకలో కాకినాడ టాకీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే బుల్లి తెరపై అనేక సార్లు టెలికాస్ట్ అయిన అతడు రీరిలీజ్ బుకింగ్స్ మరికొద్ది రోజుల్లో ఓపెన్ కాబోతున్నాయి. ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేస్తారా అని ఘట్టమనేని అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా ఈ సినిమాను 70MM స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తున్నారు.

Exit mobile version