తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనతో పాటు మంచి మసూళ్లను రాబట్టుకుంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ను గమనిస్తే ఓ చిన్నపాటి విలేజ్‌లో ఉండే ఫొటోగ్రాఫర్ రమేష్ కథ.
Also Read :2025లో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే హాటెస్ట్ అప్‌డేట్స్ !
ఇక ఈ సందర్భంగా హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంలో నేను పోషించిన రమేష్ అనే పాత్ర మనం అందరూ మన టౌన్, గ్రామంలో చూసేలానే ఉంటుంది. అతని పాత్రలోని అమాయకత్వం, తప్పు జరిగినప్పుడు పడే ఆందోళన, తప్పుపు సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నాలు అన్నీ కామెడీగా ఉంటూనే హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అతని పాత్రలోని భిన్న కోణాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అవే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా జీ 5లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కావటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మందికి సినిమా రీచ్ అవుతుంది. రమేష్ పాత్ర, అతని ప్రపంచం మరింత మందిని మెప్పిస్తుంది’’ అన్నారు. ఎక్స్‌క్లూజివ్‌గా డిసెంబర్ 5 న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ను ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది.
