కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు తమిళ నాట భారి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా రరిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ 2024 మొత్తం షూటింగ్స్ తోనే గడిపేశాడు అజిత్. ప్రస్తుతం విదాముయర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తున్నాడు అజిత్. ఈ ఏడాది సంక్రాంతికి విదాముయర్చిని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు మొదట ప్రకటించిన మేకర్స్, ఊహించని పరిణామాలతో పొంగల్ రిలీజ్ వాయిదా పడింది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విదాముయర్చి అడ్డంకులు ఏర్పడడంతో రిలీజ్ కు బ్రేక్ పడింది.
మజీజ్ తిరుమనేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మొదట దీపావళి రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ చివరి దశలో ఉండటం, పోస్టు ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో అక్కడి నుండి జనవరి 10 కి పోస్టు పోన్ అయ్యింది. కానీ అక్కడ కూడా అవరోధాలు ఎదురుకావడంతో మరోసారి డేట్ మారింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజగా విదాముయర్చి ట్రైలర్ ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రానున్న ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గా విదాముయర్చి భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. అజిత్ సరసన త్రిష నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా భారీ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సంక్రాంతికి వాయిదా పడిన అన్నిటిని దాటుకుని ఫిబ్రవరిలో థియేటర్స్ లో అడుగుపెడుతోంది.