NTV Telugu Site icon

kanchana4 : కాంచనా 4లో దెయ్యంగా నటించనున్న పొడుగుకాళ్ల సుందరి..

Untitled Design (20)

Untitled Design (20)

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంవహిస్తూ, నటించిన చిత్రం ముని. 2007లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. దానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు లారెన్స్. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను వి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో శరత్ కుమార్, లారెన్స్ నటనకు కాసుల వర్షం కురిసింది. ఆ సినిమాకు సిక్వెల్ గా 2015లో వచ్చిన గంగా ( కాంచన 3) కూడా సూపర్ హిట్ సాధించింది.

Also Read : NBGM : టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందా..?

చాలా కాలంగా దర్శకత్వం పక్కన పెట్టి హీరోగా పలు సినిమాల్లో నటించాడు లారెన్స్. తాజగా కాంచన -4ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు. కాంచన -4 కు సంబంధించి కథ మొత్తం పూర్తయిందని, గత సినిమాల మాదిరిగానే ఏ సినిమా కూడా అలరిస్తుందని ఆ మధ్య ఓ ఇంటర్వూలో తేలిపాడు. తాజాగా ఈ సినిమా నుండి కీలక అప్ డేట్ ఇచ్చాడు లారెన్స్. ఈ సినిమాలో హీరోయిన్ ముంబై భామ టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డేను ఎంపిక చేసారని తెలుస్తోంది.కాంచన -4 ను దాదాపు రూ. 100 కోట్లు బడ్జెర్ట్ లో నిర్మిస్తున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. కాగా ఈ భారీ బడ్జెట్ సినిమాను బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ మూవీస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ లారెన్స్ హీరోగా హంటర్ సినిమాను నిర్మిస్తుంది. మొదట ఈ సినిమాలో నయనతారకు హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఇప్పుడు పూజ వచ్చి చేరింది. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి

Show comments