Site icon NTV Telugu

Pahalgam Attack incident : ఉగ్రవాద దాడి ఎఫెక్ట్.. పాక్ యాక్టర్స్ మీద బ్యాన్

Pak Yaktersa

Pak Yaktersa

పహల్గాం సమీప బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఇలా మన దేశ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియాలో భారతీయలు పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సినీ నటులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: Hansika : OTT లో విడుదలైన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’

భారతీయ చిత్రాల్లో పాకిస్తానీ నటీనటులు నటించకుండా పూర్తి నిషేధం విధించింది.. ఈ నేపద్యలో ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై సోషల్‌ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. అందులో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఒకటైతే, మరొకటి వాణీ కపూర్‌ నటిస్తున్న హిందీ చిత్రం ‘అబిర్‌ గులాల్‌’. ఫౌజీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వీ, ‘అబిర్‌ గులాల్‌’లో హీరోగా నటిస్తున్న ఫవాద్‌ ఖాన్‌… ఇద్దరూ పాకిస్థాన్‌ వారు కావడమే ఈ చర్చకు కారణం. దీంతో వీరిద్దరినీ సినిమాల నుంచి తొలగించాలని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ ఒక్క పాకిస్థానీ నటుడికి కానీ నటికి కానీ అవకాశం ఇవ్వకూడదని వాదిస్తున్నారు. ఇందులో ఇమాన్వీ కరాచీలో పుట్టారు. ఆమె తండ్రి ఇక్బాల్‌ ఒకప్పుడు పాకిస్థాన్‌ మిలటరీలో ఉన్నత అధికారిగా పని చేసిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ఇమాన్వీని ‘ఫౌజీ’ చిత్రం నుంచి తొలగించాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.

Exit mobile version