Site icon NTV Telugu

తాప్సీ మూవీలో ‘ద ఫ్యామిలీ మ్యాన్’ బ్యూటీ

తాప్సీ చేస్తోన్న పలు చిత్రాల్లో ‘లూప్ లపేటా’ ఒకటి. అందులో తాహిర్ రాజ్ భసిన్ తో జోడీక డుతోంది. అయితే, జర్మన్ మూవీ ‘రన్ లోలా రన్’కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తాజాగా శ్రేయా ధన్వంతరీ కూడా స్థానం సంపాదించింది. శ్రేయా ధన్వంతరీ ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి సుపరిచితమే. అందులో ఆమె పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ‘స్కామ్ 1992’ కూడా శ్రేయాకి జనాల్లో భారీగా ఫాలోయింగ్ క్రేయేట్ చేసింది. దాంతో ఇప్పుడు ఆకాశ్ భాటియా డైరెక్ట్ చేస్తోన్న ‘లూప్ లపేటా’లోనూ కీలక పాత్రను తన ఖాతాలో వేసుకుంది.


‘లూప్ లపేటా’ సినిమాలో తనకు ఆఫర్ చేసిన క్యారెక్టర్ ఇంట్రస్టింగ్ గా, ఛాలెంజింగ్ గా ఉండటంతో వెంటనే అంగీకారించానని శ్రేయా చెబుతోంది. ‘లూప్ లపేటా’ అనే టైటిలే ఆమెకు తెగ నచ్చే సిందట! అందుకే, బాలీవుడ్ రీమేక్ లో తనకు క్యారెక్టర్ లభించగానే ఒరిజినల్ జర్మన్ మూవీ కూడా చూసేసిందట. చూడాలి మరి, ఇప్పుడిప్పుడే బీ-టౌన్ లో ఎదుగుతోన్న న్యూ బ్యూటీ శ్రేయా ధన్వంతరీ కొత్త చిత్రంతో మనల్ని ఎలా అలరిస్తుందో!

Exit mobile version