ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసిని గురించి, ఆమె నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 1980లో తమిళ చిత్రం ‘నెంజతై కిల్లతే’ తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ఏకంగా.. నాలుగు భాషల్లో ఎన్నో విజయాలు అందుకుంది. దాదాపు అందరు హీరోలతో జత కట్టి తన కంటూ ఒక గ్రాఫ్ సంపాదించుకుంది. ఇక 1988లో ఆమె ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహం చేసుకున్న సుహాసిని, ప్రజంట్ భార్య, తల్లి, నటి, నిర్మాత, దర్శకురాలిగా ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమె ఆరెళ్ళ వయసు నుండి.. ఆ వ్యాది తో బాధ పడుతున్నట్లు వెల్లడించి అందరికి పెద్ద షాక్ ఇచ్చింది.
Also Read: NTR : జపాన్‌లో భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన ఎన్టీఆర్
మనకు తెలిసి చాలా మంది సెలబ్రెటీలు ఏదో ఒక హెల్త్ ఇష్యూ తో సఫర్ అవుతూనే ఉంటారు.. అందులో కొంత మంది వారి వ్యాధి గురించి బయటకు చెప్పుకుంటారు, మరి కొందరు చెప్పుకోరు. సందర్భాలను బట్టి బయట పెడుతుంటారు. ఇందులో భాగంగా సుహాసిని కూడా ఓ ఇంటర్వ్యూలో తను ఎదురుకున్న హెల్త్ ఇష్యూ గురించి పంచుకుంది.. ‘నాకు టీబీ సమస్య ఉంది. భయంతో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాను. ఆరు నెలల పాటు చికిత్స కూడా తీసుకున్నా. ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఈ టీబీ ఉన్న విషయం బయటపడింది. కొన్నాళ్లకి అంతా సెట్ అయిన 36 ఏళ్ల వయసులో మళ్లీ టీబీ తిరగబడింది. ఈ కారణంగా ఒక్కసారిగా బరువు తగ్గిపోయా. అంతేకాదు దాని కారణంగా నాకు వినికిడి సమస్య కూడా మొదలయ్యింది. కానీ క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడంతో ఈ సమస్య తగ్గుముఖం పట్టింది’ అని సుహాసిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుహాసిని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.