Site icon NTV Telugu

క్లైమాక్స్ చిత్రీకరణలో “లక్ష్య”

The Climax shoot of Lakshya has begun today

యంగ్ హీరో నాగశౌర్య వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య” సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కరోనా అనంతరం తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నేడు ప్రారంభమైంది. ఇప్పటికే నాగశౌర్య షూటింగ్ జాయిన్ అయ్యాడట. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక “లక్ష్య” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read Also : ఫైనల్ షెడ్యూల్ స్టార్ చేసిన వరుణ్ తేజ్

ఇందులో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఇందులో నాగశౌర్య సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మన లవర్ బాయ్ కండలవీరుడిగా సరికొత్త లుక్ లోకి మారిపోయి అందరికి షాకిచ్చాడు. చివరగా “అశ్వద్ధామ” మూవీతో ప్రేక్షకులను పలకరించిన నాగశౌర్య ఖాతాలో ప్రస్తుతం వరుసగా ఐదారు సినిమాలు ఉన్నాయి. అందులో వరుడు కావలెను, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, లక్ష్య, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో పాటు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో.

Exit mobile version