సస్పెన్స్ మరియు క్రైమ్ కథలకు సినీ ప్రియుల నుండి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఇలాంటి జోనర్‌ను ఆడియెన్స్ నిరంతరం సపోర్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో, ఆసక్తికరమైన కథాంశంతో ‘ది బ్రెయిన్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఎండ్లూరి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎండ్లూరి కళావతి ఈ సస్పెన్స్, క్రైమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్, తన్విక, బేబీ దాన్విత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వారితో పాటు అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయ చంద్ర నాయుడు, రవి కాలే, జ్యోతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ‘ది బ్రెయిన్’ మూవీ షూటింగ్ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల మాట్లాడుతూ… “‘ది బ్రెయిన్’ చిత్రాన్ని పూర్తిగా క్రైమ్ అండ్ సస్పెన్స్ జానర్‌లో రూపొందిస్తున్నాం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తీస్తున్నాం” అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలను పోతు గడ్డం ఉమా శంకర్ అందిస్తున్నారు. యూఎస్ విజయ్ కెమెరామెన్‌గా, ఎంఎల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా తమ వంతు మంచి అవుట్‌పుట్‌ను అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని, విడుదల తేదీని ప్రకటించనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలియజేసింది.
