NTV Telugu Site icon

Bangaru Bomma: టైమ్స్ స్క్వేర్ మీద తెలుగు ‘బంగారు బొమ్మ’

Bangarubomma

Bangarubomma

Chandra Bose Launched Independent Music Video ‘Bangaru Bomma’: ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ ఈరోజుల్లో మాత్రం టాలెంట్‌ను ప్రద్రర్శించేందుకు ప్రస్తుతం ఎన్నో మార్గాలు, సాధనాలున్నాయి. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. యంగ్ యాక్టర్స్, మ్యూజిషీయన్స్, ఆర్ట్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్లంతా కూడా రకరకాల మాధ్యమాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కు క్రేజ్ పెరిగింది. యువ హీరో, హీరోయిన్లు సైతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌పై దృష్టి పెడుతున్నారు. అయితే మిగతా భాషలతో పోలిస్తే మాత్రం తెలుగులో ఇండిపెండెంట్ ఆల్బమ్స్ తక్కువగా వస్తుంటాయి. ఇక తాజాగా తెలుగులో ఎం.సి.హరి, ప్రొజాక్‌లు కలిసి చేసిన బంగారు బొమ్మ అనే ఇండిపెండెంట్ ఆల్బమ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజాగా పాటను ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ పాటను ఎం.సి.హరి, ప్రొజాక్‌లు రాయడమే కాకుండా స్వయంగా ఆలపించగా వేదం వంశీ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ క్రేజీ ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రణీత్ నెకురి నిర్మించారు. ఇక ఈ ఆల్బమ్‌ రిలీజ్ చేసిన అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ బంగారు బొమ్మ అనే ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను ఎం.సి.హరి, ప్రొజాక్‌లు రాయడమే కాకుండా స్వయంగా ఆలపించారు. వేదం వంశీ బాణీ కట్టారు, ప్రస్తుతం ఇలాంటి ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కి ఎక్కువగా క్రేజ్ ఏర్పడిందని అన్నారు. నిర్మాత ప్రణీత్ అమెరికాలో డాక్టర. కళ మీదున్న ప్యాషన్‌తో ఇక్కడకు వచ్చి ఇలా ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను నిర్మించారని అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ భవనంపై బంగారు బొమ్మ సందడి చేస్తోంది.