Site icon NTV Telugu

Kajal Aggarwal : అందుకే నేను తెలుగులో ఎక్కువగా మాట్లాడను..

Kajal

Kajal

Kajal Aggarwal :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన కాజల్ తన సినీ కెరీర్ ఫుల్ పీక్స్ లో వున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి తరువాత కాజల్ హీరోయిన్ గా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం కాజల్ “సత్యభామ”అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ సినిమా లో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది.

Read Also :Deepika Padukone : దీపికా పదుకోన్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం.. కారణం అదేనా..?

ఈసినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు.సుమన్ చిక్కాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను బాబీ తిక్క ,శ్రీనివాసరావు తక్కలపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి రీలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే ఈ చిత్రం ట్రైలర్ ను నేడు (మే 24 )రాత్రి 8 .01 గంటలకు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ రీలీజ్ చేయనున్నారు.అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కాజల్ తన ఏక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.ఆ వీడియోలో ఫ్యాన్స్ మీరు తెలుగు మాట్లాడండి మేడం వినాలని వుంది అని కామెంట్ చేయగా.నాకు తెలుగు బాగా వచ్చు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది తప్పో ,ఒప్పో తెలీదు.అందుకే ఎక్కువగా తెలుగులో మాట్లాడను.మీకోసం సత్యభామ ప్రీ రీలీజ్ ఈవెంట్ లో నేను తెలుగులో మాట్లాడుతా అని కాజల్ తెలిపింది.

Exit mobile version