Thank You Subbarao: ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్లో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు చెందు ముద్దు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సరికొత్త హిలేరియస్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘థాంక్యూ సుబ్బారావు’. కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో, ‘కుర్ర ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై దినేష్ కుర్ర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన టీజర్ ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్‌ను గమనిస్తే.. దర్శకుడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పక్కాగా మేళవించినట్లు స్పష్టమవుతోంది. లవ్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని బ్యాలెన్స్ చేస్తూ కథను నడిపించారు. టీజర్ విజువల్స్ చాలా ప్లెజెంట్‌గా, కలర్ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ చెప్పే డైలాగ్స్, ఆయన మార్క్ కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ ఒకవైపు ఆకట్టుకుంటూనే, మరోవైపు ట్రైన్లో ప్రయాణించే ఒక అమ్మాయి చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ ఎలిమెంట్స్ కథపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేసాయి. చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ డిఫరెంట్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
Also Read
తాజావార్తలు
-
Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
-
Jagapathi Babu: నువ్వు హీరో అయితే ఈసారి ఏం కట్ చేస్తావ్ బుచ్చిబాబూ? ?
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!