ఓటిటిలో అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. దీంతో పలు చిత్రాలు ఓటిటి వేదికపై విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానున్న మొదటి చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో మే 7న ప్రసారం కానుంది. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనసూయ గర్భవతిగా నటించారు. అయితే అహంకారం నిండిన యువకుడి పాత్ర పోషించిన విరాజ్ అశ్విన్ తో లిఫ్ట్‌లో చిక్కుకుంటుంది అనసూయ. ఆ తరువాత ఏం జరిగిందనే సినిమా ప్రధానాంశం. ఈ చిత్రానికి గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించగా… మాగుంట శరత్ చంద్రరెడ్డి, తారక్ నాథ్ బొమ్మి రెడ్డి నిర్మిస్తున్నారు. ‘థ్యాంక్ యు బ్రదర్’ చిత్రంలో అనసూయ, విరాజ్ అశ్విన్‌లతో పాటు వివా హర్ష, అర్చన అనంత్, కాదంబరి కిరణ్, అనీష్ కురువిల్ల కీలక పాత్రల్లో నటించారు.
Also Read
- Tags
- Anasuya
- Thank You Brother
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!