Site icon NTV Telugu

Thandel : జనవరికి మేం రెడీ.. కాని మామ కోసం తప్పదు..

Thandel

Thandel

సంక్రాంతి సినిమాలలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ 10 జనవరి 2025 న రిలీజ్ కు రెడీ గా ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ బాబి కాంబినేషన్ వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ‘మజాకా’ సంక్రాంతికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. దీపావళి కానుకగా బాలయ్య, బాబీ సినిమా టైటిల్ అలాగే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Also Read : Mahesh Babu : మహేశ్ ఆ సినిమాలో నటించట్లేదు.. అవన్నీ ఫేక్

కాగా ఇప్పుడు ఓ రెండు సినిమాల విషయంలో తకరాల నడుస్తుంది అందులో ఒకటి అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ మరియు విక్టరీ వెంకీ అనిల్ రావిపూడి సినిమా. తండేల్ రిలీజ్ విషయమై చిత్ర దర్శకుడు చందముండేటి తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో స్పందించారు. చందు మొండేటి మాట్లాడుతూ ” డిసెంబర్ 25 కి అయితే రెడీ అవ్వదు. ఇంకా 10 రోజులే షూట్ మిగిలి ఉంది. మేమైతే సంక్రాంతికి రెడీ గా ఉంటాం. కానీ అరవింద్ గారు చరణ్ సినిమా రామ్ చరణ్ సినిమా వస్తుందని అల్లు అరవింద్, వెంకటేష్ సినిమా వస్తుందని చైతూ ఆలోచిస్తే సంక్రాంతికి రాకపోవచ్చు” అని అన్నారు . వాస్తవానికి తండేల్ డిసెంబర్లో రావాల్సి ఉండగా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. మరి ఇప్పుడు సంక్రాంతికి వస్తారో లేదా వాయిదా వేస్తారో చూడాలి. ఒకవేళ సంక్రాంతికి రాకుంటే ఫిబ్రవరిలో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తండేల్ నాగచైతన్య కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా గా  రానుంది.

Exit mobile version