Thandel : జనవరికి మేం రెడీ.. కాని మామ కోసం తప్పదు..
- నాగ చైతన్య సాయి పల్లవి జోడిగా తండేల్
- షూటింగ్ దశలో ఉన్న తండేల్
- సంక్రాంతి రిలీజ్ పై అల్లు అరవింద్ ఆలోచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సినిమాలలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ 10 జనవరి 2025 న రిలీజ్ కు రెడీ గా ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ బాబి కాంబినేషన్ వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ‘మజాకా’ సంక్రాంతికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. దీపావళి కానుకగా బాలయ్య, బాబీ సినిమా టైటిల్ అలాగే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
Also Read : Mahesh Babu : మహేశ్ ఆ సినిమాలో నటించట్లేదు.. అవన్నీ ఫేక్
Also Read
కాగా ఇప్పుడు ఓ రెండు సినిమాల విషయంలో తకరాల నడుస్తుంది అందులో ఒకటి అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ మరియు విక్టరీ వెంకీ అనిల్ రావిపూడి సినిమా. తండేల్ రిలీజ్ విషయమై చిత్ర దర్శకుడు చందముండేటి తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో స్పందించారు. చందు మొండేటి మాట్లాడుతూ ” డిసెంబర్ 25 కి అయితే రెడీ అవ్వదు. ఇంకా 10 రోజులే షూట్ మిగిలి ఉంది. మేమైతే సంక్రాంతికి రెడీ గా ఉంటాం. కానీ అరవింద్ గారు చరణ్ సినిమా రామ్ చరణ్ సినిమా వస్తుందని అల్లు అరవింద్, వెంకటేష్ సినిమా వస్తుందని చైతూ ఆలోచిస్తే సంక్రాంతికి రాకపోవచ్చు” అని అన్నారు . వాస్తవానికి తండేల్ డిసెంబర్లో రావాల్సి ఉండగా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో వాయిదా పడింది. మరి ఇప్పుడు సంక్రాంతికి వస్తారో లేదా వాయిదా వేస్తారో చూడాలి. ఒకవేళ సంక్రాంతికి రాకుంటే ఫిబ్రవరిలో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తండేల్ నాగచైతన్య కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా గా రానుంది.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..